సెక్రటేరియట్‌లో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు.

సెక్రటేరియట్‌లో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు.
హైదరాబాద్ డిసెంబర్ 10:తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సెక్రటేరియట్లో ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ఛాంబర్లు కేటాయించింది.డిప్యూటీ సీఎం భట్టితో పాటు 11 మంది మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గ్రౌండ్ ఫ్లోర్.పంచాయతీ రాజ్ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ఫస్ట్ ఫ్లోర్.డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సెకండ్ ఫ్లోర్.వ్యయసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మూడో ఫ్లోర్. నీటి పారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఎక్సెజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నాలుగవ ఫ్లోర్.. బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డికి ఐదవ ఫ్లోర్ ఛాంబర్లు కేటాయించారు.