విజ్ఞాన నిలయాలు స్వేరో సర్కిల్ లు: DRDO సైంటిస్ట్ టీమ్

విద్యార్థులతో DRDO సైంటిస్ట్ టీమ్

విజ్ఞాన నిలయాలు స్వేరో సర్కిల్ లు:DRDO సైంటిస్ట్ టీమ్

స్వేరోస్ సర్కిల్ ఆధ్వర్యంలో రంగా రెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం, ఫరూక్ నగర్ మండలం, వెలిజర్ల స్వేరో సర్కిల్ ను DRDO Scientist Team (పే బ్యాక్ టు సొసైటీ టీమ్) సందర్శించడం జరిగింది. విద్యార్థులకు మహనీయుల ఫోటోలు, పుస్తకాలుల పెన్నులు, పెన్సిల్స్, ఆట వస్తువులు మరియు విద్యార్థులకు స్నాక్స్ అందించడం జరిగింది.


కమాండర్ లు ( భార్య భర్తలు) కావలి అశోక్ MA, MSW, కావలి సంధ్య MBA గత రెండు సంవత్సరాలుగా మన మహనీయులు చరిత్రలతో‌ పాటు స్వేరోస్ ఫౌండర్ డా: ఆర్.ఎస్.‌ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆలోచన విధానాలు అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మ గౌరవం, అధికారం అనే అంశాలనూ స్వేరో సర్కిల్లో ప్రతి రోజూ ఉదయం సాయంత్రం విద్యార్థులకు నేర్పించడం జరిగుతుంది. సర్కిల్ విజిట్ చేసిన పే‌ బ్యాక్ టు సొసైటీ టీమ్( సంతోష్ సత్నామి సార్, విజయ భాస్కర్ సార్ & ఫ్యామిలీ, విక్ర్ంత్ థాక్సాండే సార్, నికేతన్ వైద్య్, అమ్రిత్ రావ్, అశితోష్ మరియు అశోక్ కుమార్ గార్లు ) విద్యార్థులను, తల్లిదండ్రులను, కమాండర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు యొక్క ప్రాముఖ్యత, జీవితం లో వారు సాధించిన విజయాల గురించి విద్యార్థులకు వివరించారు.రాబోయే భవిషత్తు అంత స్వేరో మాయం కానుందని ఆనందం వ్యక్తం చేసారు.

చిన్నప్పటి నుండే మహనీయుల భావజాలాన్ని పసి మనస్సులో చేరుస్తూ వారి ఆశయాలను సజీవపరుస్తూ స్వేరో సర్కిల్ వారు దశాబ్ద కాలంగా ఈ సేవలందిస్తున్నారని ఇలాంటి వారికీ అను నిత్యం అండగా తోడుగా ఉంటూ నిరంతరం మా వంతుగా పే బ్యాక్ చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో స్వేరోస్ సర్కిల్ రాష్ట్ర నాయకులు మైలారం జగన్ గారు,అశోక్ గారు మరియు జిల్లా స్వేరోస్ నాయకులూ పాల్గొన్నారు.

You may also like...

Translate »