BRS నుండి BSP లోకి భారీ చేరికలు

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సమక్షంలో BSP లో చేరుతున్న వట్టే రేణుక గారు
ఉమ్మడి నల్గొండ జిల్లా DCMS చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ గారి సతీమణి 13వ వార్డు కౌన్సిలర్ వట్టె రేణుక యాదవ్ గారు ఈరోజు బహుజన సమాజ్ పార్టీ BSP లో వారి ముఖ్య అనుచరులతో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వం పొందారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ బహుజన సమాజానికి మరియు నవనిర్మాణానికి కృషి చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని తెలిపారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఎదగడానికి కృషి చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని తెలిపారు. సభ్యత్వం పొందిన 13వ వార్డు కౌన్సిలర్ వట్టె రేణుక యాదవ్ గారు మాట్లాడుతూ బహుజన వాదానికి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి పథంలో నడపడమే ఏకైక లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీలో చేరామని తెలిపారు . ఈ కార్యక్రమంలో వట్టె రేణుక యాదవ్ గారు. వట్టె ఐలమ్మ గారు, సూర్యాపేట బీసీ సెల్ అధ్యక్షుడు కుంభం వెంకన్న, పెన్పహాడ్ బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య గారు, పిల్లలమర్రి శివాలయం చైర్మన్ వల్లాల సైదులు, లింగమంతుల స్వామి దేవస్థానం డైరెక్టర్ చింతపండు జానయ్య , బి ఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మహమ్మద్ చాంద్ పాషా,ఎంపీపీ భూక్య కాంతమ్మ , ex ఎంపిటిసి ముక్కాల పద్మ,ex వార్డు మెంబర్ ముక్కాల లింగయ్య, గొర్రెల పెంపక సంఘం అధ్యక్షుడు పెద్ద బోయిన జానకి రాములు, రైతు వేదిక కమిటీ కోఆర్డినేటర్ లింగాల సైదులు, 13వ వార్డు బీసీ సెల్ అధ్యక్షుడు రాగం చిన్న లింగయ్య,TSDA టౌన్ అధ్యక్షుడు వల్లాల బుచ్చయ్య, మంటపల్లి వెంకన్న, దాసరి నరేష్ యాదవ్, పల్లపెల్లి అంజమ్మ, నాగలక్ష్మి, సూర్యాపేట నియోజకవర్గ మహిళలు మరియు ప్రధాన అనుచరులు, కార్యకర్తలు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.