ఇస్రోలో సైంటిస్ట్‌గా మన సిరిసిల్ల బిడ్డ సుశాంత్‌వర్మ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ,ISRO,లో శాస్త్రవేత్తగా సిరిసిల్ల జిల్లా కు చెందిన యువకుడు ఎంపికయ్యాడు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల రాజేశం-సుధారాణి దంపతుల కుమారుడు సుశాంత్‌వర్మ.. ఇస్రోలో సైంటిస్ట్‌గా సెలెక్ట్ అయ్యాడు.
సుశాంత్ వర్మ.. తన పాఠశాలతో పాటు ఇంటర్ విద్యాభ్యాసాన్ని కరీంనగర్‌లో పూర్తిచేశాడు. అనంతరం.. తిరువనంతపురంలోని ఐఐఎస్టీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఏరోస్పేస్ చదివాడు.
కాగా.. ఇస్రో కోసం నిర్వహించిన పరీక్షలో సుశాంత్ ఉత్తమ మార్కులు సాధించడంతో సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. ఈ పరీక్షలో..దేశవ్యాప్తంగా 41 మంది విద్యార్థులు సెలెక్ట్ కాగా.. అందులో సుశాంత్ వర్మ ఒకరు కావటం విశేషం.
_సుశాంత్ తల్లిదండ్రులు రాజేశం.. సిరిసిల్ల మున్సిపాలిటీ మెప్మా విభాగంలో కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తల్లి సుధారాణి వరదవెల్లి ప్రభుత్వ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తమ కుమారుడు ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికవటంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.