వాడి వేడి గా బీజేపీ పదాధికారుల సమావేశం కిషన్ రెడ్డి పై నేతల ఫైర్.

బీజేపీ పదాధికారుల సమావేశం గత రాత్రి జరిగింది ఈ సమావేశం హాట్ హాట్‌గా జరిగినట్టు సమాచారం పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డిపై పలువురు నేతలు ఫైర్ అయ్యారు.
పార్టీ ఏం చేస్తుందో ఎన్నికలను ఎలా ఎదుర్కొంటోందో తమకు అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది పార్టీని నమ్ముకుని నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామనిమనం మాత్రం ఆఫీసుల్లో కూర్చుని మీటింగులు పెట్టు కుంటున్నామన్నారు.
అయితే పార్టీ మీటింగ్‌లో నెగిటివ్ గా మాట్లాడడం సరి కాదని కిషన్ రెడ్డి వారించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది బీజేపీలో చేరి పదేళ్ళు అవుతుందని ఎలా మాట్లాడాలో తనకు తెలియదా అంటూ పార్టీ కీలక నేత సంకినేని వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు వరంగల్ నరేంద్ర మోదీ సభకు ఖమ్మం అమిత్ షా సభకు పెద్దగా జనం రాలేదని నేతలు పేర్కొన్నట్టు సమాచారం అక్టోబర్ 1, 3న జరగనున్న ప్రధాని మోదీ సభలకైనా భారీగా జనాల్ని తరలించాలని కిషన్ రెడ్డిని కోరారు రాష్ట్ర కార్యాలయంలో తమను ప్రెస్ మీట్‌లు పెట్టనీయడం లేదని అధికార ప్రతినిధులు తెలిపారు అధికార ప్రతినిధులుగా తమ రోల్ ఏంటో తెలుపాలని బీజేపీ నేతలు కోరారు.
