ఎంఎస్ (మంకొంబు సాంబశివన్) స్వామినాథన్ గారు ఇకలేరు.

Image Source | karat Forms
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ,హరిత విప్లవ పితామహుడు ఎంఎస్( (మంకొంబు సాంబశివన్)) స్వామినాథన్(98) ఈరోజు ఉదయం కన్నుమూశారు.
స్వామినాథన్ కొద్ది రోజులుగా ఆనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
స్వామినాథన్‌కు భార్య మీనా ముగ్గురు కూతుళ్లు సౌమ్య, మధురా నిత్యా ఉన్నారు 1987లో ఫస్ట్ వరల్డ్ ఫుఢ్ ప్రైజ్ ఆయన గెలుచుకున్నారు.
వ్యవసాయంలో విస్తృతమైన పరిశోధనలు చేయడంతో 1971 స్వామినాథన్‌కు రామన్ మెగసెసే అవార్డు వరించింది 1986లో అల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు కూడా స్వీకరించారు.