యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్

Image Source| Wikipedia

నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు

యూజీ ఆయుష్(ఆయుర్వేదం, యోగా మరియు నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి) వైద్య కోర్సులలో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రకటన జారీ చేసింది.
నీట్-2023 అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో ఆప్లోడ్ చేయాలని సూచించింది. మరింత సమాచారం కోసం వర్సిటీ వెబ్సైట్ ని సందర్శించాలని పేర్కొంది.
వెబ్సైటు : www.knruhs.telangana.gov.in

You may also like...

Translate »