అందోల్ BSP MLA అభ్యర్థి మన బిడ్డ ముప్పురపు ప్రకాష్

ప్రకటించిన బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు

ఎన్నో సంవత్సరాలుగా సాహసం పేరుతో నేను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు, ఉద్యమాలకు మీరు అందించిన ఆర్థిక, హార్దిక సహాయ సహకారాల వల్ల ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించి ఉన్నాను.


ఫలితంగా నేడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విజయ పదంలో దూసుకుపోతున్న జాతీయ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) ఆధ్వర్యంలో నేడు అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణంలో బహుజన శక్తి ప్రదర్శన జయప్రదంగా జరిగినది. ఈ సందర్భంగా శ్రీరామ ఫంక్షన్ హాల్ లో జరిగిన సభలో BSP పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు నాపై ఎంతో నమ్మకం పెట్టుకొని బహుజన ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ MLA అభ్యర్థిగా నన్ను ప్రకటించడం ద్వారా, ఈ ప్రజల కోసం నేను ఇంకా బాధ్యతగా పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.
నన్ను MLA అభ్యర్థిగా ప్రకటించిన డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి, ఈ స్థాయికి చేరుకునేందుకు సహకారం అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని భావేద్వేగం తో తెలిపారు

You may also like...

Translate »