ఫ్లెక్సీ లు కడుతున్న కార్మికులకు కరెంటు షాక్: నలుగురికి తీవ్ర గాయాలు.

హైదరాబాద్ సెప్టెంబర్ 20: రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా నలుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కు గురయ్యారు.

రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం ఈరోజు బుధవారం కుత్బుల్లాపూర్ కి మంత్రి కెటిఆర్ వస్తున్న నేపధ్యంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ బస్టాప్ సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న నలుగురికి విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో వెంటనే వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న విఠల్(19) దుర్గేష్(19) బాలరాజు(18) నాగనాథ్ (33)ల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

You may also like...

Translate »