ఏపీలో రేపే స్వేరోస్ విజయోత్సవ సభ

స్వేరోస్ అనే పదం  ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరినందుకు సంతోష పడుతూ అందుకు సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్వేరోలు ఐక్యంగా నిర్వహించుకుంటున్నటువంటి   గొప్ప వేడుక ఇది.
దశాబ్ద కాలం పాటు అక్షరం ఆరోగ్యం ఆర్థికం  అని సిద్ధాంతాలను ఊపిరిగా మలిచి ప్రతి వ్యక్తిలో దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తిని వెలికి తీసి మహోన్నతమైన వ్యక్తిగా తీర్చి దిద్ది గొప్ప నెట్వర్క్ స్వేరోస్ నెట్వర్క్.
దశాబ్ద కాలం పాటు ఎందరో స్వేరోలు తమ యొక్క సమయాన్ని,జ్ఞానాన్ని, మరియు ఆర్థిక వనరులను వెచ్చించి, ఆకలితో అలమటిస్తున్నటువంటి లక్షలాది పేదలను ప్రపంచ నలుమూలల అత్యున్నత, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివేటట్టుగా,అన్నం మెతుకులు సైతం తినడానికి లేని కుటుంబాల బిడ్డలను వేలాది మందిని డాక్టర్లుగా,ఇంజనీర్లుగా,లాయర్లుగా,వ్యాపారవేతలుగా తీర్చిదిద్ది  నేడు ప్రఖ్యాతిగాంచినటువంటి డిక్షనరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో   స్థానం సంపాదించడం  గొప్ప విజయంగా భావిస్తున్నారు. రేపటి తరాలు స్వేరోస్ అంటే ఏమిటి అనే విషయాన్ని భావితరాలకు ఈ డిక్షనరీ తెలుపుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ విజయం దశాబ్ద కాలం పాటు పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు శ్రమించి, వారి చెమట చుక్కలను డబ్బులుగా మార్చి, లక్షలాది పేద బిడ్డలను ఉన్నత శిఖరాల వైపు మళ్ళించిన ప్రతి స్వేరో బిడ్డది.
ముఖ్యంగా స్వేరోస్  ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  గారి త్యాగ ఫలితమే అందుకోవడం అని
వారి ఆలోచనలో పుట్టినటువంటి  గొప్ప మార్పే ఈ నవ సమాజానికి దారిగా మారి నేడు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ,  దాదాపు 16 రాష్ట్రాల్లో స్వేరోస్ నెట్వర్క్ శాఖలు కొనసాగుతున్నాయి.
ఇంతటి గొప్ప అవకాశాన్ని అందించినటువంటి సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్వేరోస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో  బి ఆర్ కాలేజ్ విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్నట్టు,
ఉదయం 6 గంటలకు బీమ్ రన్ తో ప్రారంభమై
సాయంత్రం 6 గంటల వరకు ఈ విజయోత్సవ సభ కొనసాగుతుందని   ఆంధ్ర ప్రదేశ్ స్వేరోస్  చీఫ్ కన్వీనర్ చిట్టయ్య గారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి  స్వేరోస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్
డాక్టర్ ప్రవీణ్ మామిడాల గారు, స్వేరోస్ వైస్ చైర్మన్ జయరాం గారు  మరియు స్వేరోస్ నెట్వర్క్ లోని  18 సంఘాల రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు  జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ కన్వీనర్  చిట్టయ్య గారు కోరారు.

You may also like...

Translate »