అనంతగిరి సోయగాల్లో వైద్య కళాశాల ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్ లో కొత్త ప్రభుత్వ వైద్య ప్రారంభోత్సవ కార్యక్రమం.

ఆలంపల్లి × రోడ్డు నుంచి ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ లో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.
పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారు,ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, యాదయ్య, కొప్పుల మహేష్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి,డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర బి సి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, నాగేందర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, స్థానిక నాయకులు,నాలుగు నియోజకవర్గం నాయకులు, విద్యార్థులు, భారీ ఎత్తున పాల్గొన్న అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు.
సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో 9 కళాశాలలకు ప్రారంభించిన తరువాత జ్యోతి వెలిగించి కళాశాలను ప్రారంభించిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.
మహేందర్ రెడ్డి కామెంట్స్
కొత్త వికారాబాద్ జిల్లా లో వైద్య కళాశాలల ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు కృతజ్ఞతలు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలించిన ఏళ్ల తరబడి కాలంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా 26 మెడికల్ కాలేజ్లను సీఎం కేసీఆర్ నేతృత్వం లో
ఏర్పాటు చేసుకున్నాం.
ఏటా 10 వేల మంది విద్యార్థులు చదువులు సాగించి రానున్న రోజుల్లోతెలంగాణ ను వైద్య దేవాలయం గా మార్చనున్నారు.
వికారాబాద్ జిల్లా 50 ఏళ్ల గల నేడు నెరవేరుతుంది.
అహల్లాద తెలంగాణ ఊటీ గా పిలవబడే అనంతగిరిలో రూ. 230 కోట్ల నిధులు, 30 ఎకరాల స్థలంలో కొత్త వైద్య కళాశాలల కు ఏర్పాటు.
తక్షణ భవన మరమత్తులకు రూ. 8 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రైవేటు మెడికల్ కళాశాల కు ధీటుగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సదుపాయాల కల్పన చేస్తాం.
వైద్యులకు ప్రజలను దేవునిలో పోలుస్తారు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత భాద్యతగా పేదలకు వైద్యం అందించాలి.
2023 – 24 లో రాష్ట్రంలో కొత్తగా రంగారెడ్డి జిల్లాతో పాటు మరో 8 వైద్య కళాశాలల ప్రారంభిస్తాం అని అన్నారు .

You may also like...

Translate »