బి.సి. గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Image Source|Pngtree
నాగార్జున సాగర్ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను బీ.ఏ. (ఇ.హెచ్.పి), బి.కాం(సీ.ఏ.) బీ. యస్సీ. (యం. పి. సి.ఎస్), బీ. యస్సీ (బీ. జడ్.సి.) కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ప్రిన్సిపాల్ డా. రవీంద్రచారి గారు తెలిపారు. అడ్మిషన్లకు చివరి తేది సెప్టెంబర్ 16వ తేది అని మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో వచ్చి నేరుగా కళాశాలలో అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఈ కళాశాలలో బాలురకు మాత్రమే అవకాశము కలదని, ఆడ్మిషన్ తోపాటు ఉచిత హాస్టల్, భోజన సదుపాయాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్స్, దుస్తులు అందించబడతాయని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు కళాశాల ఏటిపి శ్రీకాంత్ సెల్ నెంబర్ 9985172554 నందు సంప్రదించవలెనని తెలిపారు.
