శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు

Source| Science Report
శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) సోమవారం రోజున ఏడాదికి సంబంధించిన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాల ను ప్రకటించింది,సీఎస్‌ఐఆర్ మొదటి డైరెక్టర్ జనరల్ శాంతి స్వరూప్ భట్నాగర్ పేరిట ఈ పురస్కారాలను ప్రతి ఏటా సంస్థ వ్యవస్థాపక దినోత్సవమైన సెప్టెంబరు 26ను పురస్కరించుకుని ప్రకటిస్తుంటారు.
దేశంలోని 12 మంది యువ శాస్త్రవేత్తలు 2022 ఏడాదికి సంబంధించిన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలకు ఎంపికయ్యారు.
45 ఏళ్ల లోపు శాస్త్రవేత్తలకు అందించే ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. అవార్డుకు ఎంపికైన వారిలో 1. రోగనిరోధకత శాస్త్రవేత్త: దీప్యమాన్ గంగూలీ (సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ, కోల్‌కతా); 2. మైక్రోబయాలజిస్టు అశ్వనీ కుమార్ (సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ-చండీగఢ్); 3. బయాలజిస్టు మద్దిక సుబ్బారెడ్డి (సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ డైగ్నోస్టిక్స్ – హైదరాబాద్); 4. అక్కట్టు టి బిజు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ -బెంగళూరు); 5. దేబబ్రత మైతేయ్ (ఐఐటీ – బాంబే); 6. విమల్ మిశ్ర (ఐఐటీ – గాంధీనగర్); 7. దీప్తి రంజన్ సాహూ (ఐఐటీ- దిల్లీ) ; 8. రజనీశ్ కుమార్ (ఐఐటీ – మద్రాస్); 9. అపూర్వ ఖరే (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ – బెంగళూరు); 10. నీరజ్ కాయల్ (మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా – బెంగళూరు); 11. అనింద్యా దాస్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ – బెంగళూరు); 12. బసుదేబ్ దాస్‌గుప్త (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ – ముంబయి) ఉన్నారు.