ఈ నెల 12 వ తేదీ నుండి జూనియర్ లెక్చరర్ ల పరీక్షలు

ఈ నెల 12 నుండి 29 వరకు వరుసగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలను నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచే సింది. 12వ తేదీన ఇంగ్లిష్, 13వ తేదీన బోటనీ, 14వ తేదీన ఎకనామిక్స్, 20వ తేదీన కెమిస్ట్రీ, 21వ తేదీన తెలుగు, 22వ తేదీన ఫిజిక్స్, జువాలజీ, 25వ తేదీన కామర్స్, 26వ తేదీన సివిక్స్, అరబిక్స్, ప్రెంచ్, 27వ తేదీన హిందీ, 29వ తేదీన హిస్టరీ, సంస్కృతం లెక్చరర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీ క్షలు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(సీబీఆర్టీ) పద్ధతిలో జరుగుతాయి. అభ్యర్థులు వేర్వేరు సబ్జెక్టులకు దరఖాస్తు చేస్తే ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని, పరీ క్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ పేర్కొన్నది.

You may also like...

Translate »