ఓయూలో సర్టిఫికెట్ కోర్సు

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజీనీరింగ్ కు చెందిన సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రెయినింగ్(సీఈఎల్) – సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికే షన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ప్రవే శానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సును ఆఫ్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. ప్రోగ్రామ్లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది వరకు తరగతులు నిర్వహిస్తారు. ప్రొఫెషనల్స్, విద్యార్థులు, నిరుద్యోగులు, గృషిణులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
రిజిస్ట్రేషను చివరి తేదీ: సెప్టెంబరు 11

  • ప్రోగ్రామ్ ప్రారంభం: సెప్టెంబరు 12 నుంచి
  • ఫోన్ నెంబర్: 7989903001
  • వెబ్సైట్: www.uceou.edu

You may also like...

Translate »