బుదేరా వర్సెస్ పోల్కంపల్లి క్రికెట్ టోర్నమెంట్‌లో పోల్కంపల్లి జట్టు ఘన విజయం

జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్ ప్రతినిధి:
తెలిపిన వివరాల ప్రకారం జనవరి 16న ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పోల్కంపల్లి జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుని ఎనిమిది ఓవర్లలో 83 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నర్సింలు 25 పరుగులతో అద్భుతంగా రాణించగా, అనిల్ కుమార్ 18, విజయ్ కుమార్ 12, లక్ష్మణ్ కుమార్ 10, గణేష్ 8, రాజు 4 పరుగులు సాధించి జట్టును బలపరిచారు. బౌలింగ్‌లో లక్ష్మణ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా, విజయ్ కుమార్, రవికుమార్, రాజు తలా ఒక వికెట్ తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన సిహెచ్. నర్సింలుకు మెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా జ్ఞాన తెలంగాణ జర్నలిస్ట్ ప్రశాంత్ పోల్కంపల్లి జట్టును అభినందిస్తూ, ఇలాంటి విజయాలను మరిన్ని సాధించి గ్రామానికి మరింత కీర్తి తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు.
