మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి

యువ జన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్
తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించుకునే మకర సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని యువ జన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.శుక్రవారం ఝరాసంగం గ్రామం లో యువకులతో కలిసి ఆయన గాలిపటాలును ఎగురవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు,గాలి పటాల సందడితో కనువిందు చేసే సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం సంతోషం అన్నారు.. ఈ సంక్రాంతి ప్రతిఒకరి జీవితాల్లో నూతన కాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు.. ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా, పసిడి పంటలతో పరిఢవిల్లాలని భగవంతుడిని వేడుకున్నానన్నారు. చిన్నారులు ఎగురవేసే పతంగుల పట్ల తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుప్పా నగర్ సర్పంచ్ రాజు కుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రఘు వర్ధన్, వనం పల్లి నవీన్ పటేల్, మేద పల్లి సిద్దేశ్వర్ పటేల్, బొప్ప న్ పల్లి శ్రీనివాస్ రెడ్డి స్థానిక నాయకులు,రాయి కోటి నర్సిములు, ఆన్సర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
