మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఫైనల్ ఫోటో ఓటర్ జాబితా విడుదల

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం. 1362/TSEC-ULBS/2026, తేదీ 07-01-2026 ప్రకారం శంకర్పల్లి పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 15 వార్డుల వారిగా ఫైనల్ ఫోటో ఓటర్ జాబితాను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిద్ధం చేసి 12-01-2026 న అధికారికంగా విడుదల చేశారు
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఫైనల్ ఓటర్ జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రజలందరూ తమ ఓటర్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.
ఫైనల్ ఓటర్ జాబితా ప్రతులను శంకర్పల్లి పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నోటీస్ బోర్డులపై అలాగే పురపాలక సంఘ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్థం ఉంచినట్లు కమిషనర్ తెలిపారు. పేరు, ఫోటో, చిరునామా, వార్డు సంఖ్య తదితర వివరాల్లో ఏవైనా లోపాలు కనిపిస్తే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా పాల్గొని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

You may also like...

Translate »