మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు.. ప్రచార రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ :
రానున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొననుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 3న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టణాభివృద్ధి, మున్సిపల్ పాలనలో మార్పులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

You may also like...

Translate »