అంగరంగ వైభవంగా కుండలేష నాగేంద్ర స్వామి అభిషేక మహోత్సవం

జ్ఞాన తెలంగాణ/శంకరపట్నం:
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం ఆలయ చైర్మన్ కటికరెడ్డి రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పోలోజు సుమన్ శాస్త్రి బృందం చేత శ్రీ కాశీ విశ్వేశ్వర కుండలిషా నాగేంద్ర స్వామి విగ్రహాలకు 41వ మండల రోజులు పూర్తయిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఫల పంచామృతాభిషేకము పుష్పాభిషేకము నవనీత్ అభిషేకము హోమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కటికరెడ్డి కుటుంబ సభ్యులు లింగన్న కళావతి,సురేష్- సుస్మిత, రాజారాం బుచ్చన్న యాదవ్, శంకరయ్య,మంద శ్రీకాంత్,చంద్రమౌళి,కటికరెడ్డి మహేందర్, ప్రసాద్, ఓదెలు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

