సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులకు సన్మానం చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

జ్ఞానతెలంగాణ ఝరాసంగం డిసెంబర్ 20
ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామపంచాయతీకి ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్‌గా విజయం సాధించిన నేపథ్యంలో శనివారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధి పట్ల కట్టుబడి పని చేయాలని సూచించారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఝరాసంగం మండల బిఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశం, తుమ్మనపల్లి బిఆర్ఎస్ నాయకులు గ్రామ వార్డు సభ్యులు. నాయకులు పాల్గొన్నారు

You may also like...

Translate »