బీసీలు ఒక్కటైతే…..
ఓసి లు గెలువగలరా?

– కోదండ రామ్ రెడ్డి,సామజిక విశ్లేషకులు



బీసీలు,భారతదేశంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ,ఎవరు ఊహించని శక్తి, అసలైన సామూహిక బలం. కానీ ఈ బలాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది వారి విభజన, వందలాది వృత్తులుగా విడిపోయిన కుల నిర్మాణం. బీసీ వర్గీకరణను చూస్తే, తెలంగాణలో మాత్రమే దాదాపు 112 కులాలు అధికారికంగా బీసీ జాబితాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 400–500 పైగా ఉంటుంది. కమ్మరి, కవిడి, ముదిరాజు, గొల్ల,కురుమా, వడ్డెర, మాలకమ్మ, బీసీ–A నుంచి బీసీ–E వరకు విభాగాల వారీగా వందలాది కులాలు విస్తరించి ఉన్నాయి.

ఇంత పెద్ద సంఖ్యలో వర్గాలు ఒక్కచోట చేరితే, గ్రామం దగ్గర మొదలుకొని దేశ రాజధాని వరకూ రాజకీయ పటాన్ని మార్చగల శక్తి అవుతుంది. కానీ చాలాసార్లు కులాల మధ్య చిన్న చిన్న భేదాలు, అభిప్రాయ భేదాలు, మనుషుల మధ్య ఏర్పడే దూరాలు ఈ శక్తిని బలహీనపరిచాయి. అయితే ఒక గ్రామం స్థాయిలో చూస్తే,బీసీలు ఏకమైతే ఓటు ద్వారా ఏ నిర్ణయం అయినా తీసుకోగలరు. ఒక సర్పంచ్ కాదు, మొత్తం పంచాయతీ రాజకీయ వ్యవస్థను మార్చగలరు.
బీసీ కులాల ఏకత్వం—ఒక్క ఓటు కాదు, నిర్ణయ శక్తి :
ఒక గ్రామంలో సాధారణంగా బీసీ జనాభా 45% నుండి 70% వరకు ఉంటుంది. అంటే సగానికి పైగా గ్రామం బీసీ వర్గాలదే. SC, ST తోడైతే, సామూహికంగా 80% వరకు పెరుగుతుంది. ఈ సంఖ్య ఏదైనా అభ్యర్థిని సులభంగా గెలిపించే శక్తి. ఒక సర్పంచ్ గెలవడానికి 500–600 ఓట్లు సరిపోతే, బీసీ వర్గాలకు కలిపి అందుబాటులో ఉండే ఓట్లు 1000–1500 పైగా ఉంటాయి. అయితే ఎక్కువసార్లు వాగ్దానాలు, చిన్న చిన్న విభాగాలు, బాహ్య పార్టీల ప్రభావం వల్ల ఈ ఓట్లు విడిపోతాయి. ఒక్కో కులం ఒక్కో అభ్యర్థిని నిలబెడుతుంది, బలం విభజించబడుతుంది, చివరికి బీసీలే విభజించుకొని ఓడిపోతారు.కానీ ఒకే అభ్యర్థికి బీసీ వర్గాలు కలిసినప్పుడు,అది ఎన్నిక కాదు, నిర్ణయం.ఎవరు గెలుస్తారన్నది ప్రశ్న కాదు; ఎంత మెజారిటీతో గెలుస్తారన్నదే ప్రధాన విషయం.

సర్పంచ్‌ని ఎన్నుకునే శక్తి బీసీలకుంది—ఎక్కడైతే ఏకత ఉంది, అక్కడే ఫలితం :
ఒక గ్రామంలో బీసీలు 5–6 కులాలుగా ఉంటారు. చిన్న చిన్న భేదాల వలన వారు ఒకతాటిపైకి రారు. కానీ నాయకత్వాన్ని నిజాయితీగా చూసుకునే వ్యక్తిని ఎంచుకున్నప్పుడు, ఈ తేడాలు ఒక్క క్షణంలో మాయమవుతాయి. పార్టీ, కులం, పక్షం—వీటన్నిటి పైగా బీసీ సమాజం భావోద్వేగంగా, అభివృద్ధి దృష్టితో తూటా ఒక చోట పడితే ఆ గ్రామ అభివృద్ధి దిశ వేరు అయిపోతుంది.బీసీలు ఒకే అభ్యర్థిని నిలబెట్టినప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.

You may also like...

Translate »