జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,నవంబర్ 14 :
ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పార్టీ కార్యకర్తలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.ఇక మరికొద్దిసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా విజేతగా నవీన్ యాదవ్ పేరు ప్రకటించనుంది. అనంతరం అధికారులు ఆయనకు ధృవీకరణ పత్రం అందజేయనున్నారు.ఈ విజయంతో జూబ్లీహిల్స్‌లో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసినట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
