ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత ఉద్యోగాల భర్తీ

– ఏఎఫ్‌క్యాట్ నోటిఫికేషన్ విడుదల
జ్ఞానతెలంగాణ,న్యూ ఢిల్లీ, నవంబర్ 10:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT-01/2026) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్-టెక్నికల్) విభాగాల్లో ఉద్యోగాలకు అర్హత పొందవచ్చు. అదనంగా, NCC స్పెషల్ ఎంట్రీ ద్వారా కూడా ఫ్లయింగ్ బ్రాంచ్‌లో అవకాశం కల్పించనున్నారు.
అర్హత: అభ్యర్థులు ఇంటర్ (ఫిజిక్స్, మ్యాథ్స్) ఉత్తీర్ణతతో పాటు, సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు పరిమితి:
- ఫ్లయింగ్ బ్రాంచ్: 20 నుండి 24 ఏళ్లు.
- గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/నాన్ టెక్నికల్): 20 నుండి 26 ఏళ్లు.
జీత శ్రేణి: ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టుకు రూ.56,100 నుండి రూ.1,77,500 వరకు నెలవారీ వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: నవంబర్ 10, 2025
చివరి తేది: డిసెంబర్ 9, 2025
మరిన్ని వివరాలు, దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించండి:
👉 https://afcat.cdac.in/
– జ్ఞానతెలంగాణ ప్రతినిధి
