బీహెచ్ఎల్లో(BHEL) వాక్–ఇన్ ఇంటర్వ్యూలు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఎల్) లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పీటీఎంసీ–స్కిన్ (Dermatology) 01, పీటీఎంసీ–పిడియాట్రిక్స్ 01, పీటీఎంసీ–ఈఎన్‌టీ (ENT) 01 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు డెర్మటాలజీ, వెనిరియాలజీ, లెప్రసీ, చైల్డ్ హెల్త్, ఓటోరినోలారింజాలజీ వంటి విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నవంబర్ 18 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పూర్తి వివరాలు, అవసరమైన పత్రాలు, ఇంటర్వ్యూ స్థలం మొదలైన వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ careers.bhel.in ను సందర్శించవచ్చు.
