ఓడీఎఫ్‌(ODF) లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌:
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (ఓఎఫ్ఎంకే) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్‌ మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్‌ మేనేజర్‌ (ఆర్మోర్‌) 01, జూనియర్‌ మేనేజర్‌ (మెకానికల్‌) హెచ్ఎఫ్‌ 01, జూనియర్‌ మేనేజర్‌ (ఎలక్ట్రానిక్స్‌) పీఏ 01, జూనియర్‌ మేనేజర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) ఎన్క్యూ 02, జూనియర్‌ మేనేజర్‌ (మెకానికల్‌) ఎస్‌–02, జూనియర్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌) ఎస్‌–01, జూనియర్‌ మేనేజర్‌ (మెటలార్జీ) ఎస్‌–01, జూనియర్‌ మేనేజర్‌ (సీఏడీ స్పెషలిస్ట్‌) ఎస్‌–01, జూనియర్‌ మేనేజర్‌ (మెకానికల్‌) పీ–04, జూనియర్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌) సీ–01, జూనియర్‌ మేనేజర్‌ (సీఏడీ స్పెషలిస్ట్‌) పీ–01, జూనియర్‌ మేనేజర్‌ (మెకానికల్‌) డీఐ–01 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తుల స్వీకరణ నవంబర్‌ 8 నుంచి ప్రారంభమై నవంబర్‌ 28 వరకు కొనసాగుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ప్రమాణాలు, అనుభవ వివరాలు పరిశీలించి ddpdoo.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

You may also like...

Translate »