వికారాబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాల–కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట్ బూరుగుపల్లి (పాత కలెక్టరేట్ ఆఫీస్)లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల / కళాశాల (TGWRS & JC – Girls) లో ఖాళీగా ఉన్న PET, జూనియర్ లెక్చరర్ (బోటనీ, కెమిస్ట్రీ) పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ చె. ఉషాకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పోస్టులకు ఆంగ్లంలో బోధించగల అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు:
కెమిస్ట్రీ / జీవశాస్త్రం (Botany) – M.Sc + B.Ed
PET (Physical Education Teacher) – B.P.Ed
ఇంటర్వ్యూ మరియు డెమో క్లాసులు 2025 నవంబర్ 10వ తేదీ (సోమవారం) నాడు నిర్వహించబడతాయి. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం హాజరుకావలసిందిగా కోరబడుతున్నారు.
తదుపరి సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
📞 63010 13028 | 79817 18918
