వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన పామేన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:
చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పలు వివాహ మహోత్సవాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. షాబాద్ మండల PACS వైస్ ఛైర్మన్ మద్దూరు మల్లేష్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న భీమ్ భరత్ దంపతులను ఆశీర్వదిస్తూ, పరస్పర గౌరవం, నమ్మకం, ప్రేమతో బంధాన్ని బలపరచాలని సూచించారు. అనంతరం చేవెళ్ల మండల దామరగుద్ద గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు మధుసూదన్ గుప్తా బంధువుల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “వివాహం అనేది జీవితంలోని పవిత్రమైన బంధం. పరస్పర విశ్వాసం, గౌరవం, సహనంతో నిండి ఉన్న దాంపత్యం సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అన్నారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండల అధ్యక్షుడు మానయ్య, చేవెళ్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, వెంకటాపురం మహేందర్ రెడ్డి, కేబుల్ రాజు, కొమరబండ సుభాష్, చైర్మన్ వెంకటయ్య, బాలరాజు, మాధవ రెడ్డి, సాయన్న తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

You may also like...

Translate »