మాట తీరు మార్చుకో కార్తీక్ రెడ్డి

  • మచ్చలేని మా నాయకుడు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • మైలార్దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, నవంబర్ 6:
కార్తీక్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలని మచ్చలేని నాయకుడు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అని గుర్తుంచుకోవాలని మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం మైలార్ దేవులపల్లి లో గురువారం మీడియా సమావేశంలో తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం నాడు ఉదయం మీర్జాగూడ గ్రామం వద్ద మీర్జాగూడ నేషనల్ హైవే రోడ్డు ప్రమాదం లో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ గుద్దడం వల్ల 19 ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈరోజు తెలంగాణనే కాకుండా యావత్ భారత దేశాన్ని కలిచి వేసే దుర్ఘటన అని అన్నారు. ఈ సంఘటన పై కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ ప్రగాడ సానుభూతి తెలియజేశారని అంతే కాకుండా చనిపోయిన వారు అలాగే గాయపడిన వాటికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించడం మనందరికీ తెలుసు అన్నారు. ఆరోజు సంఘటన జరిగిన నాడు మన స్థానిక చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉదయం 5 గంటలకు సంఘటన జరిగిందని తెలుసుకొని అందరికంటే ముందుగా వెంటనే హుటాహుటిన సంగఘటన స్థలానికి చేసుకొని హాస్పిటల్ లో వారి కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో అక్కడ జరిగిన ఘటన ఏదైతే చూసిన సంఘటన అమాయకులైన ప్రజల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. అప్పుడు 2017లో వారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి వ్యక్తి ఈ రోడ్డు గురించి నేషనల్ హైవే గురించి మాట్లాడిన వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆరోజు ఈ నేషనల్ హైవే ఎన్నో ప్రమాదాలు జరిగి చాలామంది అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని కాబట్టి రోడ్డుకు నేషనల్ హైవే స్టేటస్ ఇవ్వాలని వారు ఎంతో కృషి చేశారని అన్నారు ఈరోజు నేషనల్ హైవే స్టేటస్ తీసుకొచ్చిన వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ఆ రోజు ఈ సంఘటనను చూసి ఇంతటికి కారణం టిఆర్ఎస్ పార్టీ అని మాట్లాడడం జరిగిందన్నారు. సంఘటన్ చూసి ఎంతో బాధతో దీనంతటికీ కారణం టిఆర్ఎస్ పార్టీ అని మాట్లాడడం జరిగిందన్నారు. వాస్తవానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ రోజు రాజకీయాలు మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడలేదని. ఆరోజు రాజకీయాలు మాట్లాడాలనుకుంటే ఆరోజున బి ఆర్ ఎస్ పార్టీ మరి ఈ రోజున ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అలాగే బి ఆర్ ఎస్ పార్టీ లో ఉన్న వ్యక్తిగత నాయకులను అంటుండే అని అన్నారు. ఈరోజు జరిగిన ప్రమాదానికి ముమ్మాటికి టిఆర్ఎస్ పార్టీ కారణం అన్నారు. కచ్చితంగా వీళ్ళు బాధ్యత వహించాల్సింది అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు దాదాపు 19 మంది అమాయకులైన ప్రజల ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. అమాకులను ప్రజల ప్రాణాలు కోల్పోవడంతో ఆవేశంతోని బాధతో ఆయన ఈ మాటలు మాట్లాడితే కార్తీక్ రెడ్డి కార్తీక్ రెడ్డికి టిఆర్ఎస్ పార్టీలో ఏ స్థానం ఉందో మాకు అర్థం కావడం లేదు కానీ ప్ర స్టేషన్లకు వస్తే అక్కడ ఉన్న చేవెళ్ల ప్రజలు గ్రామస్తులు అందరూ నిలదీయడం జరిగిందన్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు ఎంతో ఆవేదనతో సబితా ఇంద్రారెడ్డి ని మీ నిర్లక్ష్యం వల్లనే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. మొన్నటివరకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దాదాపు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా నిర్లక్ష్యం ఊహించడం అదేవిధంగా ప్రస్తుత చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వారి వల్ల కావచ్చు లేకుంటే మీరు చేవెళ్ల చెల్లమ్మ అని పిలుచుకునే సబితా ఇంద్రా రెడ్డి వల్ల కావచ్చు మీ దుస్థితి వల్లనే మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మా కుటుంబంలోని సభ్యులను ప్రాణాలు పోవడం కోల్పోవడం జరిగింద ని ఆవేదనతో నిలదీస్తే కార్తీక్ రెడ్డి ఫ్రెష్ స్టేషన్లో వచ్చి ఆయన నిజంగా ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కా లేదు అన్నారు. కార్తీక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ మేము చాలా సంస్కారం అంతగా మాట్లాడుతాం అని చెప్పడం జరిగింది నేను కార్తీక్ రెడ్డి ని సూటిగా ఒకసారి ప్రశ్నిస్తున్నాను చేవెళ్ల ఎంపీ శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సంస్కారం లేకుండా సంస్కారం హీనంగా మాట్లాడ్డడం జరిగిందన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని ఉద్దేశించి నువ్వు మాట్లాడే పదజాలం ఇదేనా నీ సంస్కారం అని అన్నారు. షార్ట్ టైమ్ మెమరీ లాస్ ఉంది నువ్వు ఏం పీకినావ్ అని మాడ్లాడుతున్నావే నువ్వు మాడ్లాడుతున్న పదజాలం నీ విచక్షణకు వదిలేస్తున అని అన్నారు. ఇదే నా మీ పెద్దలు సభ్యులు నేర్పిన సంస్కారం అన్నారు. రాజకీయాలు మాట్లాడండి తప్పులేదు. కానీ ఈరోజు పని జరగకపోవడం కారణం ఎవరు పని ఆవిధంగా జరగాలి మాట్లాడింది కానీ ఈరోజు ఒక నాయకుణ్ణి పట్టుకొని ఒక మచ్చలేని నాయకుడిని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని పట్టుకొని మాట్లాడడం చాలా సిగ్గు చేటు అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నేను ఈరోజు సూటిగా ఒక ప్రశ్న అడగడాల్చుకున్న 40 సంవత్సరాలు మీ కుటుంబమే కదా ఈ జిల్లాను పాలిస్తుంది. మీ అమ్మ కదా ప్రతి నిధ్యం వహించింది. మరి మీరు ఎం చేశారని నేను అడుగుతున్నా అని అన్నారు.

You may also like...

Translate »