వరంగల్ నిట్‌లో ఉచిత గేట్ కోచింగ్

ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), వరంగల్ లోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత ‘గేట్’ కోచింగ్ తరగతులు ప్రారంభించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఈ కోచింగ్ నిట్ విద్యార్థులతో పాటు వరంగల్ పరిసర ప్రాంతాల ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటుంది.
కోర్సు 8 వారాలు కొనసాగి నవంబర్ 17 నుంచి జనవరి 9 వరకు నిర్వహించబడుతుంది. అన్ని ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించిన ఈ తరగతులు విద్యార్థులు గేట్ పరీక్షకు సమర్థంగా సిద్ధం కావడానికి సహాయపడతాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నిట్ వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాల కోసం నిట్ ఎస్సీ, ఎస్టీ సెల్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
