అనిల్ అంబానీకి ఈడీ సమన్లు

నవంబర్ 14న విచారణకు హాజరు కావాలని ఆదేశం
బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణ మోసానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇటీవల అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.7,500 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆస్తుల్లో ఎక్కువ భాగం రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందినవని గ్రూప్ వెల్లడించింది.
