రాష్ట్రవ్యాప్తంగా అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

– నవంబర్‌ 10 నుంచి 22 వరకు హనుమకొండలో ఆర్మీ నియామక శిబిరం


జ్ఞాన తెలంగాణ,హనుమకొండ ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి అగ్నివీర్‌ ఎంపిక కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనుంది. ఈ ర్యాలీ ద్వారా అర్హత కలిగిన యువతకు భారత సైన్యంలో చేరేందుకు అవకాశం లభించనుంది.

ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం లేదా ర్యాలీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఫోన్‌ నంబర్లు: 040-27740059, 040-27740205.

రాష్ట్ర యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తగిన శారీరక సిద్ధతతో ర్యాలీకి హాజరుకావాలని అధికారులు సూచించారు.

You may also like...

Translate »