తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు ప్రారంభం

కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఆదేశాలు


జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2:

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్) ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (TG SEC) సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల నిర్వహణకు ముందుగా గ్రామ పంచాయతీ (GP) వార్డుల వారీగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను మరోసారి పూర్తి చేయాలని TG SEC సూచించింది. ఇంకా ఎవరైనా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకోకపోతే, ఇప్పుడు ఆ అవకాశం ఉందని పేర్కొంది.

ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, 2025 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు కావడానికి అర్హులు. ఈ సారి యువ ఓటర్లను పూర్తిగా నమోదు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

You may also like...

Translate »