డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలతో బౌద్ధ ధమ్మ మంగళ పరిణయం

జ్ఞాన తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా , నవంబర్ 1, 2025 :
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచనలను అనుసరిస్తూ బౌద్ధ ధమ్మ మంగళ పరిణయం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ తండా కాలనీలోని ఆయుష్మాన్ డాక్టర్ ఎస్.పి. శ్రీనివాస్ నాయక్ (Pharma D, M.Sc, Ph.D) – గుజరాత్ రాష్ట్రంలోని పారుల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు – ఆయన తన జీవిత భాగస్వామిగా ఆయుష్మతి సభావత్ రాధిక (B.Tech) ను బౌద్ధ ధర్మ మార్గంలో ఎంచుకున్నారు.ఈ వివాహం అక్టోబర్ 30, 2025 (గురువారం) వధువు స్వగృహంలో సాంప్రదాయబద్ధంగా బౌద్ధ ధమ్మ పద్ధతిలో జరిగింది. అనంతరం ఇరువురి రిసెప్షన్ అక్టోబర్ 31, 2025 న వరుని గృహం, ఫరూక్‌నగర్‌లో జరిగింది.
బౌద్ధ ధమ్మ పరిణయాన్ని ధమ్మ ఫిలోమథ్ సొసైటీ (DPS, హైదరాబాద్) సభ్యులు – ధమ్మాచారి దిమంత్ తోకల సంజీవరెడ్డి, దిమంత్ బి. రాహుల్, డాక్టర్ ఎన్. కుమార్, మరియు బౌద్ధ భిక్షు పూజ్య నాగభూషణ్ భాంతే జీ (మీరట్) సమక్షంలో ధర్మపద్ధతిలో నిర్వహించారు.సమానత్వం, సామాజిక అభివృద్ధి, మానవతా విలువలతో నిండిన కొత్త జీవన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ జంటను కుటుంబ సభ్యులు, బౌద్ధ బహుజనులు ఆశీర్వదించారు.
ఈ వేడుకలో శాంతి-దాస్ రామ్ నాయకు, బుజ్జి-భీమ్ సింగ్, కేలీ-భీమ్ ల, మోహన్, పీ.రాజ్, భాస్కర్, రవి, రఘు, హనుమ, వదినలు తదితరులు పాల్గొన్నారు.
