మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు తడిసిన వడ్లను రైస్ మిల్లులకు పంపిస్తున్నాం

  • రైతులు ఎలాంటి ఆందోళన చందనవసరం లేదు
  • ప్రభుత్వం తడిసిన వడ్లను కొంటుంది
  • సైదాపూర్ పాక్స్ ఎల్ఎస్సీఎస్ అధ్యక్షుడు కొత్త తిరుపతి రెడ్డి

జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్ ఆర్సీ ఇంచార్జ్:

మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో తడిసిన వడ్ల సేకరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు సైదాపూర్ విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో తడిసిన వడ్లను శనివారం మిల్లులకు తరలించారు. ఎల్‌ఎస్‌సీఎస్ సైదాపూర్ అధ్యక్షుడు కొత్త తిరుపతి రెడ్డి తెలిపిన ప్రకారం, ఇప్పటివరకు నాలుగు లారీలలో మొత్తం 2,400 బస్తాలను మిల్లులకు పంపించగా, సంఘం పరిధిలోని కేంద్రాల నుంచి మరో 2,000 క్వింటాళ్ల తడిసిన వడ్లను కూడా తరలించినట్లు అయిన వెల్లడించారు. అకాల వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. తడిసిన వడ్ల సేకరణ నిరంతరంగా కొనసాగుతుందని, ఒక రైతుల ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని పాలకవర్గం స్పష్టం చేసింది.

You may also like...

Translate »