దేశ గౌరవాన్ని దెబ్బతీసేల రేవంత్ వాక్యాలు

- దేశ గౌరవాన్ని దెబ్బతీసేల రేవంత్ వాక్యాలు
- రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం
- బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
జ్ఞాన తెలంగాణ న్యూస్ డెస్క్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.రేవంత్ రెడ్డి చేసిన “పాకిస్థానోడు ముడ్డి మీద తంతే అక్కడ బాంబులు వేయరు, కానీ జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే కార్పొరేట్ బాంబింగ్ చేస్తారంట” అన్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలను దేశ సైనికుల ధైర్యసాహసాలను అవమానించేలా ఉన్నవిగా పేర్కొన్నారు.“పాక్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన మన సైనికుల త్యాగం, ధైర్యం దేశ గర్వకారణం. అలాంటి సైనికులపై అపహాస్య వ్యాఖ్యలు చేయడం సీఎం స్థాయికి తగదు. ఇది కేవలం రాజకీయ తప్పు కాదు — దేశ గౌరవానికే దెబ్బ” అని బండి సంజయ్ మండిపడ్డారు.అలాగే, ప్రధాని మోదీ నాయకత్వంలో సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత్ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని ఆయన గుర్తు చేశారు. “ఆ సైనికుల త్యాగం మీద రాజకీయ ప్రదర్శనలు చేయడం రాష్ట్ర ప్రజలకే కాదు, దేశానికీ తలవంచే విషయం అని సంజయ్ పేర్కొన్నారు.
సైనికుల గౌరవం అంటే దేశ గౌరవం. ఆ గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినందుకు రేవంత్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లాభాల కోసం జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాలను తేలికగా తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.బండి సంజయ్ ప్రజలకు పిలుపునిస్తూ సైన్యం చేసిన త్యాగాలపై ఎవరైనా అపహాస్యం చేస్తే, దేశ ప్రజలే సమాధానం చెబుతారు.ప్రజలు ఈ వ్యాఖ్యల వెనుకున్న అసలు ఉద్దేశాన్ని గుర్తించి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారు” అన్నారు.
