హైతాబాద్ గ్రామంలో కమ్యూనిటీ పేస్ట్ కార్యక్రమం

  • హైతాబాద్ గ్రామంలో కమ్యూనిటీ పేస్ట్ కార్యక్రమం లబ్ధిదారులకు పరికరాల పంపిణీ

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల, అక్టోబర్ 29 : షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో మైక్రోసాఫ్ట్ అనుసంధానంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరియు వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, యువత తమ వృత్తి అభివృద్ధికి ఉపయోగపడే పరికరాలను అందుకున్నారు. కుట్టుమిషన్లు, కూరగాయల బండ్లు, ప్లంబర్ కిట్లు, ఎలక్ట్రిషన్ కిట్లు, డ్రై క్లీనింగ్ మెషిన్‌లు, ఐరన్ బాక్సులు తదితర పరికరాలు లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి లబ్ధిదారులకు పరికరాలు అందజేశారు. గ్రామీణ మహిళలు, యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడేలా ఈ పథకాలు తోడ్పడతాయని ఆయన తెలిపారు.

మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీం నుంచి చందన, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ చెన్నయ్య, మాజీ సర్పంచులు కాజ మియా, జనార్దన్ రెడ్డి, నాయకులు స్వామి, శ్రీనివాస్, రమేష్, యాదయ్య, జానీ మియా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »