షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిల రద్దు పట్ల హర్షం

- తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట నాయకులు పాతూరి వెంకటరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపి, శాలువాతో ఘనంగా సన్మానించిన పౌల్ట్రీ రైతులు
- ఆస్తి పన్ను రద్దుకు సహకరించిన అరెక పూడి గాంధీ, వేంనరేందర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
జ్ఞానతెలంగాణ,షాద్ నగర్,అక్టోబర్ 29:
రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల పౌల్ట్రీ రైతులకు విధించిన ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ను తీసుకురావటం పై షాద్ నగర్ పౌల్ట్రీ రైతులు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట నాయకులు పాతూరి వెంకటరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలుసుకుని శాలువా ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట నాయకులు పాతూరి వెంకటరావు మాట్లాడుతూ… 80 వ దశకంలో సుమారు 200 కుటుంబాలు అప్పటి చటాన్ పల్లి గ్రామ పంచాయతీలో పౌల్ట్రీ ఫారాలను నెలకొల్పుకుని జీవనం సాగిస్తూ వస్తున్నారని, అప్పట్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో కోడా పౌల్ట్రీ లకు ఆస్తి పన్ను మినహాయింపు ఉండేది అని అన్నారు. అప్పటి కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం షాద్ నగర్ ను మున్సిపాలిటీ గా మార్చి చటాన్ పల్లి గ్రామాన్ని మున్సిపాలిటీ లో విలీనం చేయటం జరిగింది అని , అప్పటి నుండి మున్సిపల్ అధికారులు ఎవరితో సంప్రదించ కుండా ఇష్టానుసారం గా ఆస్తి పన్ను కట్టాలని రైతులపై ఆస్తి విధిస్తూ, కట్టాలని వత్తిడి చేస్తూ వచ్చారు అన్నారు.. దీనిపై పౌల్ట్రీ రైతుల తరుపున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్న మంత్రులను కలసి విన్నవించటం, తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్, ఈటెల రాజేందర్ మరియు ఎంపీ రంజిత్ రెడ్డి లను అనేక మార్లు కలవటం రైతుల బాధలు చెప్పటం, ఇలా నిరంతరం పోరాడటం వల్ల అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2021 లో రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ లకు సంబంధించిన అన్ని రకాల పన్ను లు రద్దు చేస్తూ జీవో ను విడుదల చేయటం జరిగిందని అన్నారు. కానీ ఆనాటి మున్సిపల్ అధికారులు కావాలని బకాయిల పేరుతో రైతుల పై కోర్టు లో కేసులు వేసి రైతులను ఇబ్బందులకు గురి చేయటం జరిగిందని , దీనిపై కోర్టులో పోరాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర పీఏసీ ఛైర్మన్ ఆరేకపూడి గాందీ సహకారంతో, ముఖ్య మంత్రి ప్రధాన సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి లను కలవడం వారి కృషితో, స్తానిక ఎమ్మెల్యే శంకరయ్య సహకారంతో రైతుల సమస్యను మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి, రైతులపై ఉన్న ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ జీవో తీసుకురావడం ఆనందదాయకం అన్నారు. రైతులకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వేంనరేందర్ రెడ్డి కి, అన్ని రకాలుగా మాకు అండదండలు అందిస్తూ, మా వెన్నటి ఉన్న అరెకపూడి గాంధీ కి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి మరియు స్తానిక ఎంఎల్ఏ శంకరయ్యకు పౌల్ట్రీ రైతుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు గుదే వసంతరావు, మక్కాపాటి మల్లేశ్వర రావు, కొర్రపాటి శ్రీనివాస రావు, మలినేని సాంబశివ రావు, కొడాలి సురేష్, మలినేని శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
