రూ.1.41 కోట్లు విలువైన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 29 : చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య మరియు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కలిసి శంకర్ పల్లి, చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయాలలో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శంకర్ పల్లి మునిసిపాలిటీ, మండలం మరియు చేవెళ్ల మునిసిపాలిటీ, మండలాలకు చెందిన లబ్ధిదారులకు కలిపి మొత్తం రూ.1,41,02,256/- (ఒక కోటి నలభై ఒక లక్షల రెండు వేల రెండు వందల యాభై ఆరు రూపాయల) విలువైన 141 చెక్కులు అందజేయబడ్డాయి.పేద కుటుంబాల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఎంతో మంది కుటుంబాలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి అర్హులైన మహిళకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులుగా MRO, MPDO, మాజీ జెడ్పీటీసీ గోపాల్ రెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, బలవంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రమోహన్, వీరేందర్ రెడ్డి, దేవర వెంకటరెడ్డి, ప్రతాప్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మధుసూదన్ గుప్తా, పాండు, ప్రభాకర్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.






