దేవుని ఎర్రవల్లి గేటు వద్ద రోడ్డు ప్రమాదం

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి,అక్టోబర్ 29 : ఈరోజు ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో చేవెళ్ల నుండి శంకర్‌పల్లి వైపు వెళుతున్న డీసీఎం వాహనం దేవుని ఎర్రవల్లి గేటు వద్దకు రాగానే అదుపు తప్పి, దేవుని ఎర్రవల్లి గ్రామానికి వెళ్తున్న షిఫ్ట్ కారును ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో షిఫ్ట్ కారు దేవుని ఎర్రవల్లి కమాన్‌ వద్ద ఉన్న గోడకు గుద్దుకుని పూర్తిగా దెబ్బతింది.అదే సమయంలో, గేటు వద్ద ప్రయాణికులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీని కూడా డీసీఎం ఢీకొట్టి, ఒక్కసారిగా మళ్లీ చేవెళ్ల వైపు తిరిగి ఆగిపోయింది. సాధారణంగా ప్రతిరోజూ ఆ బెంచీపై విద్యార్థులు, ప్రయాణికులు కూర్చునే వారు. అయితే, ఈరోజు వర్షం కారణంగా అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. షిఫ్ట్ కారు దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

You may also like...

Translate »