మొంథా తుపాను ఎఫెక్ట్, ప్రజల అప్రమత్తతే శ్రీరామరక్ష : భీమ్ భరత్

మొంథా తుపాను ఎఫెక్ట్, ప్రజల అప్రమత్తతే శ్రీరామరక్ష : భీమ్ భరత్


జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 29:
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన మొంథా తుపాను తీరం దాటి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం చూపనుందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా సహా చేవెళ్ల నియోజకవర్గంలో భారీ వర్షాలు, ఈదురు గాలులు తీవ్రంగా వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భీమ్ భరత్ గారు తెలిపారు,వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని, రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా,బస్సులు మరియు రైళ్లు రద్దు చేసినట్లు వివరించారు.ఈ క్రమంలో, ప్రజల ప్రాణ రక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విభాగాలను సిద్ధంగా ఉంచిందని, ముఖ్యంగా విద్యుత్, మున్సిపల్, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుని ప్రతి ప్రాంతంలో సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉండాలని భీమ్ భరత్ కోరారు.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణం చేయాలనుకునేవారు తుపాను పూర్తిగా సద్దుమణిగే వరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. రైతులు విద్యుత్ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, తమ ప్రాణాల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని భీమ్ భరత్ గారు హెచ్చరించారు.
ప్రజల అప్రమత్తతే శ్రీరామరక్ష అని గుర్తుచేసిన భీమ్ భరత్ ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే, మొంథా తుపాను ప్రభావాన్ని సురక్షితంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.

You may also like...

Translate »