మోకిలా, పిలిగుండ్ల పంచాయతీల్లో శుభ్రతా కార్యక్రమాలపైఅధికారులు ప్రశంస


జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి :
మోకిలా మరియు పిలిగుండ్ల గ్రామ పంచాయతీలను EX. CEC శ్రీ జె. ఎం.లింగ్డో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు MPDO శ్రీ వి.వెంకయ్య, అపో, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
సందర్శనలో భాగంగా డంపింగ్ యార్డు, మోకిలా సెగ్రిగేషన్ షెడ్‌లను పరిశీలించి,తడి – పొడి చెత్త వేరు చేసే విధానాన్ని పరిశీలించారు. పంచాయతీ స్థాయిలో చెత్త వేర్పు సక్రమంగా అమలవుతున్నందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపుపై తీసుకుంటున్న చర్యలను కూడా అభినందించారు.
తదుపరి నర్సరీ, P.P.V, ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమాల అమలును పరిశీలించి, పంచాయతీల్లో ఉన్న ఆస్తులను (assets) సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను, సిబ్బందిని ప్రశంసించారు.

You may also like...

Translate »