స్థానిక పోరులో సత్తా చాటాలి

  • మాజీమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితఇంద్రారెడ్డి

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 27:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె నివాసంలో డీసీఎంఎస్ చైర్మన్‌ పట్లొళ్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంతారం గ్రామానికి చెందిన ఆండాలుబాలన్నగౌడ్‌, పది మంది గ్రామస్తులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ… 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేసి రేవంత్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అంతారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాకపురం రామస్వామి, బాకపురం యాదమ్మ, బేగరి శేఖర్‌, ఇటుకాల నర్సింలు, ఖానపురం జంగయ్య, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »