బిర్కూర్ రోడ్డుపై దాన్యం ఆరబోత

జ్ఞాన తెలంగాణ బాన్సువాడ ప్రతినిధి అక్టోబర్ 24:
బాన్సువాడ మండలం నుండి బీర్కూర్ కు వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని ఆరబోశారు సగం రోడ్డు నిండా ధాన్యం ఆరబోయడంతో ద్విచక్ర వాహన చోదకులకు తప్పని బాధలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కన్నెత్తి చూడని అధికారులు, ప్రతి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కుప్పలను గమనించాక వాహనాలు ఢీకొని ప్రమాదాలకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తగా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై దాన్యం ఆరబోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.
