అనుమానస్పద స్థితిలో కొప్పు కుమార్ మృతి

అనుమానస్పద స్థితిలో కొప్పు కుమార్ మృతి

  • అనుమానస్పద స్థితిలో కొప్పు కుమార్ మృతి
  • కొప్పు కుమార్ కు తీవ్ర రక్త గాయాలు
  • కేశంపేట లో ఘటన

జ్ఞాన తెలంగాణ, కేశంపేట్ ప్రతినిధి 12 :
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల కేంద్రానికి చెందిన కుప్పు కుమార్ అనే దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంట్లోనే నీటి సంపులో అతను శవమై తేలడం గమనార్హం. వృత్తిరీత్యా కూలీనాలీ చేసుకొనే కుమార్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున నీటి సంపులో శవమై కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. కుమార్ తలపై బలమైన రక్త గాయాలు ఉన్నాయి. కుమార్ మృతికి కారణాలు తెలియ రావడం లేదు. కుమార్ ను ఎవరైనా హత్య చేశారా పథకం ప్రకారం హత్య చేసి నీటి సంపులో పడేశారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుమార్ ఆకస్మిక మృతితో విషాద వాతావరణం నెలకొంది.

You may also like...

Translate »