పోలియోను నిర్మూలిద్దాం:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :

ఈరోజు (12-10-2025) ఆదివారం నాడు చేవెళ్ల పట్టణంలో మరియు శంకర్ పల్లి పట్టణంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యమానికి ముఖ్యఅతిథిగా హాజరై, చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… చిన్నారుల్లో పోలియో వ్యాధి నివారణకు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.పోలియో వ్యాధి వివరణకు పోలియో చుక్కలు వేయడమే ఆయుధం అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »