చలాన్లపై చెల్లిపు కు 45 రోజులే ?

చలాన్లపై చెల్లిపు కు 45 రోజులే ?


  • 45 రోజుల్లోగా చెల్లించకపోతే వాహనం స్వాధీనానికి అవకాశం
  • ఐదుకి మించి ఉంటే లైసెన్సు రద్దు!
  • ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో నిర్లక్ష్యంవహిస్తే మూల్యం తప్పదు
  • కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటన విడుదల

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో నిర్లక్ష్యంవహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్‌ పడితే.. పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి లేదా మీ తప్పేమీ లేకుంటే అప్పీల్‌ చేసుకోవాలి. అంతకుమించి ఆలస్యం చేస్తే… మీ బండిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు.. డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యువల్‌ కాకపోవచ్చు.. ఐదుకి మించి చలాన్లు ఉంటే ఏకంగా లైసెన్సే రద్దవ్వచ్చు. సెంట్రల్‌ మోటారు వెహికిల్స్‌ రూల్స్‌-1989లో కేంద్ర రవాణాశాఖ ఈ కీలక సవరణలను ప్రతిపాదించింది. గతంలో చలాన్లపై చర్యల అంశం సవివరంగా లేకపోవడంతో కొత్తగా పలు కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ రూల్స్‌ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్‌ చేయడం వంటి అంశాలను డిజిటల్‌ మానిటరింగ్, ఆటోమేషన్‌ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడురోజుల్లోగా ఎలక్ట్రానిక్‌ రూపంలో నోటీసు జారీ చేయాలని, ఫిజికల్‌ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది.

You may also like...

Translate »