దసరా పండుగ సందర్భంగా బాకీ కార్డ్ విడుదల చేసిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

  • నియోజకవర్గ వ్యాప్తంగా రెండు రోజులపాటు బాకీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గం ప్రతినిధి అక్టోబర్ 3:

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరూ గ్యారెంటీలు 420 హామీలు నెరవేరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 700 రోజులు గడిచిన ఇప్పటివరకు సంపూర్ణంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు బాకీ పడింది . రైతులను, రైతు కూలీలను, మహిళలను, యువకులను, నిరుద్యోగులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసినా కాంగ్రెస్ పార్టీ. రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదనీ, రైతు భరోసాకు ఎగనామం పెట్టి, వడ్లకు బోనస్ ఇవ్వలేనీ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతతో రైతులు మహిళలలు చిన్నపిల్లలు కుటుంబాలతో సహా గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి అనేక ఇబ్బందులు పడుతున్నారు.సరైన సమయంలో రైతులకు యూరియా అందక పంటల దిగుబడి తగ్గి రైతులు పంట నష్టపోవడం జరిగింది.పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎకరాకు 25000 ఇవ్వాలని . నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పటికీ ఎలాంటి చలనం లేకపోవడం దురదృష్టకరం.కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను అమలు చేయని హామీలను ప్రతి ఇంటింటికి వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ మరియు అన్ని మండల కేంద్రాలలో గ్రామాల్లో వార్డుల వారిగా ప్రతి నాయకుడు కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బాఖీ కార్డ్స్ ని పంపిణీ చేస్తూ విధిగా సెల్ఫీలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు బాకీ కార్డు చూపించి, హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులను నిలదీయవలసిందిగా కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భాకీ కార్డ్స్ ను బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు

You may also like...

Translate »