ఇది బావిగుంత అనుకుంటే పొరపాటే…. అక్రమ సెల్లార్

- ప్రమాదకరంగా భారీ తవ్వకం
- నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్
- నిర్మాణదారుడుపై అధికారులు చర్యలు తీసుకోవాలి
జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03:
భారీ ఎత్తున తవ్విన భావి గుంత లాగా కనిపిస్తున్న ఈ దృశ్యం బావి కోసం అనుకుంటే పొరపాటు పెద్ద ఎత్తున ప్రమాదకరంగా ఓ నిర్మాణదారుడు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ తవ్విన దృశ్యం ఎలాంటి అనుమతులు లేకపోయినా నిబంధనలు తుంగలో తొక్కి సదరునిర్మాణదారుడు భారీ ఎత్తున సెల్లార్ తీశాడు చుట్టుపక్కల పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా భారీ నిర్మాణం చేపడుతున్నాడు. వివరాల్లోకెళ్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుకు కేవలం 50 అడుగుల దూరంలోని శాంట్పెక్ట్ స్కూల్ కి వెళ్లే మార్గంలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా పెద్ద ఎత్తున తెల్లారు తొవ్వడం జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ లో నివాసయోగ్యమైన గృహాలు మాత్రమే అనుమతి కానీ భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం అయితే సెల్లార్లకు ఎలాంటి అనుమతులు లేవు అయినప్పటికీ రాళ్లగూడలో శాంటాక్స్ స్కూల్ కి వెళ్లే మార్గంలో ఓ నిర్మాణదారుడు అనుమతి లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరంగా సుమారు 30 నుంచి 40 అడుగుల లోతున సెల్లార్ తవ్వకాలు చేపడుచుండడంతో అటుగా వెళ్లే స్థానికులు ఇది బాయా లేక సేళ్లారా అర్థం కాని పరిస్థితిలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ప్రమాదకరంగా సెల్లార్ నిర్మాణం చేపడుతున్న అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి నిబంధనలకు విరుద్ధంగా జీవో 111 ఉల్లంఘించి అటు సెల్లారు ఇటు భారీ నిర్మాణం చేపడుతున్న నిర్మాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


