బాధితకు కుటుంబానికి ఆర్థిక సాయం

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని :
వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో ఇటీవల బి ఆర్ ఎస్ కార్యకర్త అశోక్ తల్లి మృతి చెందిన విషయం తెలుసు కొన్న ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీ ల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇస్తూ ఆర్ధిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమం లో గుజ్జ అశోక్, చింతం రమేష్, గంగప్ప, శ్రీనివాస్, మాజీ కోప్షన్ మెంబర్ ఎజాజ్, ఆనంద్ గౌడ్, వర్ని సొసైటీ డైరెక్టర్ గంగప్ప, మాధస్తా సాయిలు తదితరులు పాల్గొన్నారు